Andhra PradeshHome Page Slider

రెండు భాగాలుగా రాబోతున్న RGV మూవీ- ‘వ్యూహం’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రాజకీయ చిత్రం ‘వ్యూహం’ రెండు భాగాలుగా రాబోతోందంటూ వర్మ ప్రకటించారు. నవంబర్ 10న వ్యూహం-1 రిలీజ్ కాబోతోంది. జనవరి 25న ‘శపథం’ పేరుతో వ్యూహం 2 రిలీజ్ కాబోతోందని వర్మ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ముఖ్యాంశంగా రాబోతున్న ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి కలిగించేలా ట్రైలర్‌ను గతంలోనే విడుదల చేశారు.

దీనిలో వ్యూహం చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపించినట్లు అర్థమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ అనుభవించిన కష్టాలు, రాజకీయ ఒత్తిడులు, జైలు జీవితం మొదలైన సంఘటనలు ఉన్నాయి. అనంతరం జగన్ ముఖ్యమంత్రి కావడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలు, వారి రాజకీయ ఎత్తుగడలు వంటి సీన్లు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఆయా పాత్రలు ధరించిన నటులు సరిగ్గా నిజజీవితంలో వారిని పోలి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ మార్కు బాగా కనిపిస్తోంది అంటున్నారు ప్రేక్షకులు.