చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైసీపి కీలక నేత,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఓ బాలికను దూషించారని తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అటు తిరుపతి,ఇటు ప్రకాశం పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా ఇబ్బంది లేదని,వాటన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం,అందుబాటులో లేకుండా పోవడం లాంటి పనులు చేయనని ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పారు.