శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో లుఫ్తాన్సా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఫ్రాంక్‌ఫర్డ్ నుండి బయలుదేరిన వెంటనే ముందు టైరులో సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం వారి సూచన మేరకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి మళ్లించారు. విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.