Home Page SliderTelangana

శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం..

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గోవా నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంకు ATC అధికారులు ల్యాండింగ్‌కు అవకాశం ఇచ్చారు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శంషాబాద్ నుంచి ప్రయాణికులతో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు. విమానం గాల్లో పది నిమిషాలు చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.