బెడిసికొట్టిన ప్లాన్.. భర్త సేఫ్, ప్రియుడు మృతి
ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి మార్కెట్‌లో చోటు చేసుకుంది. భర్త సంతోష్‌ను హత్య చేసేందుకు ప్రియుడు కుమార్ ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు తానే సంతోష్ చేతిలో ప్రాణాలు విడిచాడు కుమార్.. అది చూసిన భార్య శైలజ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుమార్, శైలజ మధ్య ఎఫైర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.