పాలస్తీనా ప్రజల శవాలు పూడ్చడానికి చోటేది!
గాజా-పాలస్తీనా ప్రజలపై చేస్తున్న యుద్ధంలో మృతుల సంఖ్య 40 వేలు పైమాటే.10 నెలల్లో 40,005 మంది పాలస్తీనా ప్రజలతోపాటు మిలిటెంట్లు మరణించారు. గాజాలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి ఎక్కడా 6 గజాల స్థలం కూడా దొరకటం లేదు. సమాధిపైనే మరో సమాధి నిర్మించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని మృతదేహాలను పార్కులు, ఇంటి మెట్ల కింద పూడ్చిపెడుతున్నారు. బతికున్నవారు కూడా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చావు కోసం ఎదురుచూస్తున్నారని రచయిత యూస్రీ అన్నారు.