Home Page SliderNational

TTEపై చేయి చేసుకున్న ప్రయాణికుడు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టీటీఈపై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. తొలుత ప్లాట్‌ఫామ్‌పై టీటీఈకి, ఆ ప్రయాణికుడికి ఏదో విషయంపై గొడవ జరిగింది. ప్రయాణికుడు సహనం కోల్పోయి టీటీఈని వెనక్కి తోశాడు. తర్వాత టీటీఈని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆ ప్రయాణికుడిని టీటీఈతో పాటు ఇతర సిబ్బంది కొట్టారు. దీనిని అడ్డుకునేందుకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి  గురిచేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.