Breaking NewsHome Page SliderInternationalNews

ఉక్రెయిన్‌పై అణుయుద్ధం …గజగజలాడుతున్న ప్రపంచం

ప్రపంచం భయపడినంత పనీ అయ్యింది. ఉక్రెయిన్‌పై ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ప్రయోగించాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనితో ప్రపంచదేశాలలో వణుకు ప్రారంభం అయ్యింది. ఈ క్షిపణి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలు మోసుకెళ్లగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్లు ఉంటుందిట. దీనిని అప్‌గ్రేడ్ చేసి 2023లోనే రష్యా సైన్యంలో చేర్చారు. రెండవ ప్రపంచయుద్ధంలో జరిగిన అణుబాంబు దాడిని ఇంకా ప్రపంచదేశాలు మరిచిపోలేదు. లక్షల మందిని పొట్టబెట్టుకున్న ఆ అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన దీనిని ప్రయోగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఊహించడానికే వణుకు వస్తుంది. ఈ క్షిపణి బరువు 208 టన్నులు. 10 టన్నుల పేలోడ్‌ను మోయగలదు. ఇలాంటి క్షిపణి ప్రయోగం జరిగితే దేశం మొత్తం సర్వ నాశనం అయిపోతుందని భయపడుతున్నారు.