Home Page SliderNational

వైరలవుతున్న లవ్లీ కపుల్ “వరుణ్‌లవ్” కొత్త ఫోటో

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్,లావణ్య త్రిపాఠి త్వరలోనే దంపతులు కాబోతున్నారు. కాగా ఈ నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు విహార యాత్రలో ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాలలో దిగిన ఫోటోను వీరిద్దరు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తమ ఎంగేజ్‌మెంట్‌కు విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వరుణ్‌తేజ్,లావణ్య ఒకే ఫోటోను,ఒకే క్యాప్షన్‌తో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూడముచ్చటైన జంట మీరు కలకాలం కలిసి సంతోషంగా ఉండాలని వీరి అభిమానులు,సినీ ప్రముఖులు  కామెంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటో షేర్ చేసిని కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్ సొంతం చేసుకొని వైరల్‌గా మారింది. వరుణ్‌తేజ్,లావణ్య 2016లో “మిస్టర్” సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో వారిద్దరు మంచి స్నేహితులయ్యారు.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో “అంతరిక్షం” సినిమా కూడా వచ్చింది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.