Breaking Newshome page sliderHome Page SliderNational

మహిళా ఆత్మనిర్భరతకు నూతన దిశ

బీహార్ ప్రభుత్వం రాష్ట్ర మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనా” అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1.21 లక్షల మహిళలకు లబ్ధి అందించనున్నారు. ప్రతి లబ్ధిదారికి రూ.10,000 ప్రోత్సాహక నిధి రూపంలో ఇవ్వబడుతుంది. ఈ నిధి ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలను పోషించుకోవడానికి సహాయపడేలా రూపకల్పన చేయబడింది. ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మాట్లాడుతూ “మహిళా సాధికారతే బీహార్ పురోగతికి పునాది. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం,”
అని పేర్కొన్నారు.