Home Page SliderTelangana

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో జరిగింది. పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద యాదగిరి శేఖర్ రావు కారును లారీ ఢీ కొట్టింది. శేఖర్ రావుకు స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. నిజామాబాద్‌లో ప్రచారం ముగించుకొని కరీంనగర్ వైపు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.