స్టార్ క్రికెటర్ పై హత్య కేసు నమోదు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ శాసన సభ్యుడు షకీబ్ అల్ హసన్ హత్యకేసులో ఇరుక్కున్నాడు. అతనిపై అడాబోర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది. గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్ ను హత్య చేయాలని ఆదేశించినట్లు షకీబ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ మంత్రి ఒవైదుల్ క్వాడర్ సహా 156 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం షకీబ్ పాకిస్థాన్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 68 టెస్టులు, 247 వన్డేలు, 129 టీ20 మ్యాచ్ లు బంగ్లాదేశ్ తరఫున ఆడిన అనుభవం ఉంది.


 
							 
							