మహేష్‌బాబుతో సినిమా.. హరీష్ శంకర్?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి లాంటి సినిమా తీయాలని ఉందని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. పోకిరి తనకు అచ్చు పుస్తకం లాంటిదని చెప్పారు. ఇప్పటివరకూ మహేష్‌కు స్టోరీ కబుర్లు ఏమీ చెప్పలేదన్నారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్ – రవితేజ కాంబినేషన్‌లో సినిమా తీయాలని తనకు ఉందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అంతగా కుదరదని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని తెలిపారు.
