కవల చిన్నారులతో తల్లి బిల్డింగ్‌పై నుండి దూకి ఆత్మహత్య
సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణ విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎత్తైన అపార్ట్‌మెంట్ పైనుండి ఇద్దరు పసి పాపలను తోసేసి, తల్లి సౌందర్య అనే మహిళ తానూ దూకి ఆత్యహత్య చేసుకుంది. నేడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు అందిన ఫిర్యాదు ప్రకారం నిత్య, నిదరష్ అనే ఏడాదిన్నర వయస్సు గల పసిపిల్లలతో కూడి తల్లి సౌందర్య బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడమే ఆమె మరణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

