క్రికెట్ చరిత్రలోనే అద్భుతం..టీమిండియా రికార్డ్
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. గతంలో ఎవ్వరూ సాధించని విధంగా రికార్డు నెలకొల్పారు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో భారత మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 525 రన్స్ చేశారు. ఇంత స్కోరు పురుషుల క్రికెట్‌లో కూడా లేకపోవడం విశేషం. ఒక్కరోజులో ఇంత స్కోరు సాధించడం క్రికెట్ చరిత్రలోనే లేదు. 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి, 509 రన్స్ చేసింది. ఇప్పటి వరకూ ఇదే అతి పెద్ద స్కోరు. అయితే ఈ రికార్డును బద్దలు కొట్టారు భారత మహిళా క్రికెటర్లు. స్టార్ ప్లేయర్స్ షెఫాలీ డబుల్ సెంచరీ చేసి 205 పరుగులు చేశారు. స్మృతి మంధాన 149 పరుగులు, జెమీమా 55 పరుగులు చేశారు. ఇంకా క్రీజులో 42 పరుగులతో హర్మన్, 43 పరుగులతో రిచా ఆడుతున్నారు.