శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగరాం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అవన్నీ సఫల కావడం లేదు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిత్యం బంగారం,మాదవ ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కస్టమ్స్ అధికారులు మరోసారి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనిపై పక్కా సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికున్ని తనిఖీ చేశారు. అతడు ఎమర్జెన్సీ లైట్‌లో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణికుడి దగ్గర నుంచి రూ.1.82 కోట్లు విలువైన 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

