ఓ వ్యక్తికి జాక్ పాట్.. రాత్రికి రాత్రే లక్షాధికారి
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో మద్దికెర మండలం పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయ పరిసరాల్లో తొలకరి జల్లులతో కొనసాగుతున్న వజ్రాల వేటలో ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తికి వజ్రం దొరికింది. దొరికిన వజ్రాన్ని రూ.30 లక్షలకు ప్రైవేటు వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేసి దాంతోనే సంతృప్తి చెందాడు. అయితే.. పెరవలి వ్యక్తికి దొరికిన వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తుంది. వజ్రం దొరికిన ఘటనపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు.

