Home Page SliderNational

కాటేసిన పాముతోనే ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. వైద్యులు షాక్

ఓ వ్యక్తి తనను కాటేసిన పాముతోనే ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడం చూసి అందరూ షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తికి వైద్యులు ఎంత చెప్పినా ఆ పామును వదిలిపెట్టలేదు. రస్సెల్స్ వైపర్ అనే విషపూరితమైన పాము బీహార్ లోని భాగల్ పూర్ లో ఉండే ప్రకాశ్ మండల్ అనే వ్యక్తిని కాటు వేసింది. ఆ వ్యక్తి ఆ పాము నోటిని గట్టిగా పట్టుకుని, మెడకు చుట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. పాముతో ఉన్న అతడిని చూసి వైద్యులు, అక్కడ ఉన్న రోగులు షాక్ అయ్యారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పామును వదిలిపెట్టాలని వైద్యులు, అక్కడ ఉన్నవారు ప్రకాశ్ మండల్ ను కోరారు. అయినా అతడు ఆ సర్పాన్ని విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నాడు. అలాగే తనకు చికిత్స అందించాలని కోరాడు. అది తనతోనే ఉండాలని చెప్పాడు. అయితే, పామును అలా చేతిలో పట్టుకుని ఉంటే వైద్యం చేయడం కష్టమని డాక్టర్ నచ్చజెప్పారు. దాంతో చివరకు పామును విడిచిపెట్టాడు. ప్రస్తుతం ప్రకాశ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.