ఉప్మాలో బొద్దింక, విమానంలో ప్రయాణికుడు ఏం చేశాడంటే..!
విమానంలో ప్రయాణించే వారికి విమానయాన సంస్థే అన్ని వసతులు కల్పించడం సర్వ సాధారణమైన విషయమే. ఈ క్రమంలోనే ఎయిర్ విస్తారా విమానంలో ప్రయణించే ప్రయాణికులకు ఎప్పటిలాగే భోజనాలు పంపిణి చేసింది. అయితే తనకు అందించిన భోజనంలో బొద్దింక వచ్చిందంటూ ఓ వ్యక్తి ఆరోపించాడు. జర్నీ సమయంలో తనకు అందించిన భోజనంలో వచ్చిన బొద్దింకను నికుల్ సోలంకి అనే ప్రయాణికుడు తన ట్వీటర్లో పోస్ట్ చేశాడు. ప్రయాణ సమయంలో తినేందుకు ఇచ్చిన ఇడ్లీ సాంబార్ , ఉప్మాలో…చిన్నపాటి బొద్దింక ఉప్మాలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎయిర్ విస్తారా , అతను పోస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే స్పందించింది. హీలో నికుల్ మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేస్తాం. దయచేసి మీ విమాన వివరాలను డీఎం ద్వారా వాకు పంపించండి. తద్వారా ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.