రాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలపైకి దూసుకొచ్చిన కారు..
హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఓ వ్యక్తి విచక్షణరహితంగా కారును నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ హల్ చల్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మల్లెపల్లి అన్వర్ ఉలూమ్ కాలేజీ వద్ద టయోటా కారు రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా.. ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు చూస్తుండగానే కారును రివర్స్ తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

