ప్రాణాలు తీసిన సరదా.. క్రాకర్స్ తో ఛాలెంజ్
సరదా కోసం ఆటలు ఆడితే మంచిది..కానీ ఆ ఆటలే సవాల్ గా మారితే ఒక్కసారి ప్రాణాలకు మీద తెస్తుంటాయి. అటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాల్ చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలోని సౌత్ బెంగళూరులోని కోననకుంటె పోలీస్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. కాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని 32 ఏళ్ల శబరీశ్ అనే వ్యక్తికి స్నేహితులు సవాల్ చేశారు. అంతేకాదు ఈ చాలెంజ్ లో గెలుపొందితే ఆటో గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. సవాల్ స్వీకరించిన శబరీశ్ మద్యం మత్తులో అలాగే చేయడంతో క్రాకర్లు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురు నిందితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

