టర్కీలో భారీ భూకంపం..
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్ భారీ భూకంపంతో విలవిల్లాడింది. ఇస్తాంబుల్‌కి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదయ్యింది. ఈ ప్రకంపనలు బల్గేరియా, రొమేనియా, గ్రీస్‌లలో కూడా కనిపించాయని సమాచారం. ప్రమాద నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ భూకంపం టర్కీ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 2023 ఫిబ్రవరిలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రపంచంలోనే తీవ్రమైనదిగా చెప్తారు. అప్పట్లో సిరియా, టర్కీలలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.