home page sliderHome Page SliderInternational

భారీ భూకంపం..

గ్రీక్ లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. గ్రీస్ లోని ఫ్రైకి దక్షిణాన 9 మైళ్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భారీ భూకంపం తర్వాత కసోస్ కు ఆగ్నేయంగా సుమారు 30 మైళ్ల దూరంలో 5.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లు చెప్పిన గ్రీక్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ … సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.