బీఆర్‌ఎస్‌లో చేరుతామని ఎంతో మంది కోరుతున్నారు…
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ సహృదయంతో రూపకల్పన చేసినవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయాలను చూడకుండా ప్రజలకు పనికొచ్చేవే చేస్తారన్నారు. నిజామాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు కవిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేదింటి ఆడ బిడ్డల పెళ్లికి లక్షా 116 సాయం చేస్తున్నారని.. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పథకం ఉందా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని కవిత పేర్కొన్నారు. నగరంలో ఉన్న పాత భవనాలను కూల్చేస్తామన్నారు. పాత కలెక్టరేట్ ప్రదేశంలో కళాభారతిని, మైనార్టీలకు హజ్ హౌస్‌ను నిర్మిస్తామన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఏర్పాటుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, మంచి స్పందన వస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరుతామని ఎంతో మంది కోరుతున్నారన్నారు కవిత.

