Home Page SliderTelangana

లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

మందుబాబులకు ఒకే సారి లారీ నిండా లిక్కర్ బాటిల్ కనపడితే ఆగుతారా.. లేదు ఆ రోజు పండగ చేసుకుంటారు మరి. అయితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారు జామున జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్క్ కంటైనర్ ను వరుసగా లారీలు ఢీకొట్టాయి. దీంతో కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడటంతో మందుబాబులు లిక్కర్ బాటిళ్ల పై ఎగబడ్డారు. చేతికి అందినకాడికి బాటిళ్లను తీసుకుని పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టి సహాయక చర్యలు చేపట్టారు.