NationalNewsNews Alert

మధ్యప్రదేశ్‌లో స్కూల్ వ్యాన్‌ని ఢీకొన్న లారీ

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా , మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్వేల్ పట్టణంలోని జిర్నియా ఫాటా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు ఉజ్జయిని సూపిరింటెంట్ ఆఫ్ పోలీస్ సత్యేంద్ర శుక్లా తెలిపారు. నగ్దాలోని ఫాతిమా కాన్వేంట్ స్కూల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు వివరించారు. నగ్దా – ఉన్హేల్ రహదారి వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ లారీ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిందన్నారు.

సమాయానికి అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులే ఆస్పత్రికి తరలించినట్టు సమచారం. అయితే ఈ ఘటనలో నలుగురు చనిపోగా , మరో ముగ్గురి  పరిస్థితి విషమంగా ఉందని తేలియజేశారు. మిగత 8మందికి నగ్దాలోని వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. చనిపోయిన వారందరు 18 ఏళ్ల లోపు వారని తెవిపారు. చనిపోయిన వారు భవ్యాంశ్ (16) , సుమిత్(18) , ఉమ(15) , ఇనయ(6) గా గుర్తించారు. ఈ క్రమంలో నగ్దాలో విషాదఛాయలు అలముకున్నాయి.