రైల్వే సిగ్నల్ లోపంపై ముందే హెచ్చరించిన రైల్వే అధికారి – పై అధికారికి రాసిన లేఖ లభ్యం
ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన సిగ్నల్ వ్యవస్థలో లోపం ఉన్న విషయం మూడు నెలల క్రితమే వెలుగులోకి వచ్చింది. ఈ సిగ్నల్ పై మూడు నెలల క్రితమే ఒక రైల్వే అధికారి పై అధికారులకు లేఖ రాసారు. పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేసిన హరిశంకర్ అనే అధికారి ఇంటర్ లాకింక్ సిస్టమ్‌ను బైపాస్‌గా మార్చగా లొకేషన్ బాక్సులో లోపాలు ఉన్నాయని తెలియజేస్తూ లేఖ రాసారు. దీనిని నిలిపి వేయాలని, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రైలు బయలుదేరాక డిస్పాచ్ రూట్ మారుతోందని, దీనివల్ల చాలా ప్రమాదం జరగవచ్చని పై అధికారులకు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి ప్రమాదం జరుగుతుందని తెలిసినా, సరైన నివారణ చర్యలు తీసుకోని రైల్వే అధికారులే ఈ ఘోర ప్రమాదానికి, వందల ప్రాణాలకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.