అర్థరాత్రి ఇంట్లో చిరుత పులి కలకలం..
జనారణ్యంలోకి వన్యప్రాణులు రావడం ఇటీవల పెరిగిపోయింది. నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఏనుగులు, పులులు, సింహాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.తాజాగా ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో.. ఓ చిరుత పులి మెల్లగా ఇంటి సమీపానికి వచ్చింది. అతడిపై దాడి చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. అయితే.. దూరం నుంచి మంచం పక్కన పడుకున్న కుక్కను టార్గెట్ చేసిన చిరుత పులి.. దాని వద్దకు చేరుకుంది. సమీపానికి రాగానే ఒక్కసారిగా కుక్క మెడ పట్టుకుని బయటి లాకెళ్లిపోతుంది. కుక్క అరుపులతో నిద్రలేచని ఆ వ్యక్తి.. పులి వెళ్లిన వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే.. ఇది ఎక్కడ జరిగింది అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

