APలో పరీక్షకు ముందే లీకైన ప్రశ్నాపత్రం
తెలంగాణాలో ఇటీవల కాలంలో పలు పోటి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణా ప్రభుత్వం ఈ పోటి పరీక్షలను రద్దు చేసింది. అయితే ఈ పేపర్ లీకేజీతో తెలంగాణా వ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఆందోళనలతో నిరసనలు చేపట్టగా..తెలంగాణాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతేకాకుండా రద్దు చేసిన పరీక్షలను ప్రస్తుతం TSPSC నిర్వహిస్తుంది.ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ లీకైంది. కాగా ఈ ఉదయం 8:30 గంటలకు నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంట్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. కాగా వారు వేరే ప్రశ్నాపత్రంతో ఎగ్జామ్ నిర్వహించారు. దీంతో ఆ పరీక్ష ఓ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ప్రకాశం జిల్లాలోని బీఎడ్ కాలేజీలో క్వశ్చన్ పేపర్ లీకైనట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

