Home Page SliderNational

కిలో కేవలం రూపాయే-ఉల్లిరైతు కన్నీరు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లి పండించే రైతు మాత్రం కన్నీరుమున్నీరవుతున్నాడు. మహారాష్ట్రలో అన్నదాతల దుస్థితికి కళ్లకు కట్టే సంఘటన జరిగింది. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం కష్టపడిన రైతుకు దక్కింది రూపాయే. ఉల్లిపాయల ధరలు అమాంతం పడిపోవడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 512 కిలోల ఉల్లిపాయలను శోలాపూర్ మార్కెట్‌కు తీసుకొచ్చారు. అవి అమ్ముడుపోక,  కేవలం కిలో రూపాయి చొప్పున అమ్మవలసి వచ్చింది. పంటను పొలం నుండి తీసుకొచ్చేందుకు అయిన కూలీల ఖర్చులు, రవాణా ఖర్చులు, మార్కెట్ ఖర్చులు కలిపి 510 రూపాయలు అయ్యిందట. అంటే అతనికి దక్కిన లాభం కేవలం 2 రూపాయలే. మార్కెట్ అధికారులు అతనికి కేవలం 2 రూపాయలకు చెక్కునందించారు.