Andhra PradeshHome Page Slider

వాలంటీర్లపై కీలక అప్‌డేట్

వాలంటీర్లపై కీలక అప్‌డేట్ ఇచ్చారు మంత్రి పార్థసారథి. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖలలో క్రమంగా కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. క్యాబినేట్ భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన  ఈ విషయం పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.07 మంది వాలంటీర్లు ఉన్నారని మిగిలినవారు రాజీనామా చేశారన్నారు. 2023లో వారి పదవీకాలం ముగిసిందని, అయినా వారిని రెన్యువల్ చేయలేదన్నారు. మరోపక్క సాక్షి పత్రికపై ఆయన ఆరోపణలు చేశారు. సాక్షి కొనుగోలు కోసం రూ.102 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాం అని పేర్కొన్నారు.