ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు
పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని బీఆర్ ఎస్ పార్టీ కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్వవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా….హైకోర్టు డివిజన్ బెంచ్ దాన్ని తప్పుబట్టింది.ఐదేళ్ల కాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని పేర్కొంది.దీంతో బీఆర్ ఎస్‌కి చుక్కెదురైనట్లైంది.ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీ సుప్రీం ని ఆశ్రయిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.