లివింగ్ కంప్యూటర్‌లో మనిషి మెదడు
కొత్త కొత్త ఆవిష్కరణలతో టెక్నాలజీకి ఆకాశమే హద్దుగా మారింది. ఏఐ రాకతో మరింత వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పుడు కొత్తగా కంప్యూటర్‌లోకి మనిషి మెదడులోని న్యూరాన్లను కూడా నిక్షిప్తం చేస్తున్నారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లను, కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు కలిపి ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు. దీనికి ‘బ్రెయినోవర్’ అని పేరు పెట్టారు. డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే ఇది 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందట. దీనితో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టవచ్చని, సాధారణమైన కంప్యూటర్ చిప్ లాగానే ఇది పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇది సిగ్నల్స్‌ను కూడా కంప్యూటర్ చిప్ లాగానే పంపిస్తుందట.

