పెంగ్విన్ ఐలాండ్‌కు భారీ ముప్పు
అంటార్కిటికాలో పెంగ్విన్ ఐలాండ్‌కు భారీ ముప్పు సంభవించనుంది. భౌగోళిక పరిస్థితుల కారణంగా భూ వాతావరణం వేడెక్కి అంటార్కిటికాలోని భారీ మంచు పర్వతం ఎ23ఎ అనే ఐస్ బర్గ్ కదులుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ ఐస్ బర్గ్ దాదాపు 280 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సౌత్ జార్జియా వైపుగా కదులుతున్నట్లు శాటిలైట్ ఫోటోలలో తెలుస్తోంది. సముద్ర, వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఐస్‌బర్గ్ ప్రబావితమవుతోందని పేర్కొన్నారు. సౌత్ జార్జియా ఐలాండ్‌కు సమీపంలో ఉన్న ఈ ఐస్ బర్గ్ నెమ్మదిగా జరుగుతూ పెంగ్విన్ ఐలాండ్ వైపుగా జరుగుతోంది. అయితే ఇవన్నీ సహజంగా సముద్రంలో జరిగే ప్రక్రియని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే భౌతిక సముద్ర శాస్త్రవేత్త ఆండ్రూ మీజర్స్ పేర్కొన్నారు.


