భారత్‌కు భారీ టార్గెట్
భారత్- న్యూజిలాండ్ క్రికెట్ రెండవ టెస్ట్ మ్యాచ్ పుణే వేదికగా జరుగుతోంది. భారత్ ముందు 359 పరుగుల భారీ స్కోర్‌ను నిలిపింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆలౌట్ అయిపోయింది. భారత్ బౌలర్లలో సుందర్ 4 వికెట్లు పడగొట్టారు. జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్ లాథమ్ 89 పరుగులతో రాణించగా, బ్లండెల్ 41, ఫిలిప్స్ 48 రన్స్ చేశారు. అయితే భారత్‌కు ఈ మ్యాచ్‌లో ఆదిలోనే నిరాశ ఎదురయ్యింది. హిట్ మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. యశస్వి దూకుడుగా ఆడుతూ 50 పరుగులకు చేరువయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 155 పరుగులకే అవుటవడంతో రెండవ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.

