ఇస్రో చరిత్రలో భారీ విజయం
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో స్పేస్‌లో మరో మైలురాయిని అధిగమించింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన 4వ దేశంగా అవతరించింది. స్పేస్‌లో రెండు వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి ఒకటి చేసింది. 2024 డిసెంబర్ 30న శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60లో జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. స్పేడెక్స్ 1బి, 1ఏ ఉపగ్రహాలను ఈ ప్రక్రియ ద్వారా అనుసంధానించారు. ఈ టెక్నాలజీ ద్వారా చంద్రయాన్4, గగన్‌యాన్ వంటి సరికొత్త ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఇంతవరకూ అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. ఇస్రో ఛైర్మన్ నారాయణన్, ఇతర సైంటిస్టులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అభినందించారు.
Breaking news: బాలీవుడ్ నటుడుపై కత్తి తో దాడి…

