Home Page SliderNationalPolitics

ఆప్‌ పార్టీకి భారీ షాక్‌.. 10 రోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే!

ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 10 రోజుల్లో 164 కోట్లు చెల్లించాలంటూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆధీనంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ నోటీసులు పంపింది. ఒకవేళ గడువులోగా చెల్లించకుంటే పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. పార్టీకి సంబంధించి ఆస్తులను సైతం జప్తు చేయడానికి వెనకాడబోమని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్‌ ప్రకటనలు ఇచ్చుకుందని, అందకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆప్‌ వృధా ఖర్చు చేసిందని నోటిసులో పేర్కొంది. దీన్ని ఆప్‌ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి మరి.