రెండ్రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయటపెడతా..
రెండ్రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయట పెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల ఇష్యూ వెనక ఓ తెలంగాణ బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు.

