ప్రఖ్యాత శ్రీకృష్ణదేవాలయ హుండీకి భారీగా బహుమానం
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ వద్ద ప్రసిద్ధ సన్వాలియా సేథ్ శ్రీకృష్ణుని ఆలయ హుండీకి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కిలో బరువు గల బంగారు బిస్కట్లు, రూ.23 కోట్లకు పైగా విలువ గల నగదు కానుకలుగా వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, బంగారు బిస్కెట్లు, వేణువులు వంటి ప్రత్యేక వస్తువులు భక్తులు ప్రేమతో కృష్ణునికి సమర్పించుకున్నారని పేర్కొన్నారు.