NewsTelangana

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభ… హాజరుకానున్న జేపీ నడ్డా

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.  ప్రచారంలో కమలం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి దూసుకుపోతున్నారు.  ఈనెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తోంది. బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏ మండలంలో సభ నిర్వహించాలనే దానిపై బీజేపీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. దీపావళికి ఇంటికొచ్చిన క్యాడర్‌.. తిరిగి మునుగోడులో చేరుకొని నేటి నుంచి గడపగడపకు ప్రచారాన్ని మొదలుపెట్టారు.