Home Page SliderNews Alerttelangana,

ప్లాస్టిక్ ఫాక్టరీలో భారీ ప్రమాదం..బూడిదైన భవనం

హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పాలిథిన్ సంచులు తయారు చేసే ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న సాయంత్రం మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో నేటికీ మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున జరిగిన ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా కాలిపోయి, బూడిదకుప్పగా మారింది. మొదటి అంతస్తులో ప్లాస్టిక్ ముడిసరుకు ఉండడంతో  మంటలు అదుపులోకి రావడం లేదు. 4 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, పక్కనున్న ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్త పడగలిగారు.