బండి సంజయ్ ప్రచారానికి హెలికాప్టర్ కేటాయించిన కేంద్రం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పై ఈటలను పోటీకి దింపి తెలంగాణలో ఎన్నికల వేడిని రాజేసిన బీజేపీ.. ఇపుడు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు కీలక ప్రచార బాధ్యతలను అప్పగించింది.

