‘అమరన్’కు అవార్డుల పంట..
చెన్నైలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ‘అమరన్’ చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఎడిటర్ అవార్డులను సాధించింది.
ఉత్తమనటిగా సాయిపల్లవి అవార్డును అందుకున్నారు. 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని సాయిపల్లవి పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముకుంద్ కుటుంబసభ్యులు, ఆయన భార్య అందించిన సహాయ సహకారాలకు, అభిమానులు చూపించే ప్రేమకు ఎంతో రుణపడి ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు సాయిపల్లవి.
అలాగే ఉత్తమ నటుడిగా ‘మహారాజ’ చిత్రానికి విజయ్ సేతుపతి అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఉత్తమ చిత్రంగా ‘అమరన్’, రెండవ ఉత్తమ చిత్రంగా ‘లబ్బర్ పందు’ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ సంగీత దర్శకునిగా జీవీ ప్రకాశ్ ‘అమరన్’ చిత్రానికి అవార్డును అందుకున్నారు.

