కలలను నియంత్రించే ‘హాలో’ మెషీన్
హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఇన్‌సెప్షన్ సినిమాను నిజం చేశారు అమెరికాకు చెందిన సైంటిస్టులు. ఆ చిత్రంలో ఉన్నట్లు కలలను నియంత్రించే యంత్రాన్ని కనిపెట్టారు. దీనికి హాలో అనే పేరు పెట్టారు. ఈ అద్భుతమైన పరికరాన్ని ప్రొఫెటిక్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. మన కలలను నియంత్రించడానికి, ఎలాంటి కలలు కనాలో నిర్దేశించుకోవడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు. దీనిద్వారా కావలసిన కలలను కనవచ్చని, నచ్చిన కెరిర్‌కు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఈ మెషిన్ నిద్రపోయే ముందు తలకు ధరించాలని, అది అల్ట్రాసౌండ్, మెషిన్ లెర్నింగ్‌ల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. దీని ధర రూ. 1.25 లక్షల నుండి రూ.1.66 లక్షల వరకూ ఉండవచ్చని ఈ సంస్థ పేర్కొంది. ఇది మనం ఎలాంటి కలలు కనాలో వాటిని ప్రోగ్రామింగ్ ద్వారా మెదడును నియంత్రించడం ద్వారా ఆదేశాలు జారీ చేస్తుందని పేర్కొన్నారు. సమయం వృధా కాకుండా మరుసటి రోజు జరగబోయే మీటింగులకు, పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలను కలల ద్వారా నియంత్రించుకోవచ్చని తెలియజేశారు. ఇది లూసిడ్ అనే దశలో కలలను విశ్లేషిస్తుందన్నారు.