మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా ఘన విజయం
టీమిండియా మరో ఘనతను సాధించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన భారత్ ఇంగ్లండ్ నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలుపొందింది. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 53 పరుగులు చెలరేగిపోగా, శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లకే 166 పరుగులకు ఆలౌటయ్యింది. తన కెరీర్లో తొలి టీ 20 ఆడిన ఆటగాడు హర్షిత్ రాణా మ్యాజిక్ బౌలింగ్‌తో ఏకంగా మూడు వికెట్లు తీసి అద్భుతం చేశారు. దీనితో ఒక దశలో గెలుస్తుందనుకున్న ఇంగ్లాడ్ కుప్పకూలింది. హర్షిత్‌తో పాటు రవి బిష్ణోయ్ కూడా 3 వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి2, అక్షర్ పటేల్, అర్షదీప్ చెరొక వికెట్ పడగొట్టారు. ఐదవ టీ 20 ఆదివారం ముంబయిలో జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్‌ను గెలవడంతో ఈ మ్యాచ్ ప్రభావం భారత్ గెలుపుపై ఉండదు.