గాంధీజీకి సంగీతంతో ఘనమైన నివాళి..ఏఆర్ రెహమాన్
మహాత్మాగాంధీ జీవిత కథతో రాబోతున్న సిరీస్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీజీ జీవితంలోని భావోద్వేగం, ఆధ్యాత్మికతను తెరపైన చూపించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఈ సిరీస్ తరపున ఘనమైన నివాళి అందిస్తున్నారు. గతంలోనే గాంధీ జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సిరీస్‌ను నిర్మిస్తున్న అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో సంస్థ గాంధీ జయంతి సందర్భంగా ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే కథగా మిగిలిపోతుందని వెల్లడించారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ఈ సిరీస్‌లో గాంధీజీ జీవితం, దేశస్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం చాలా అద్భుతంగా తెరకెక్కించారని వెల్లడించారు. ఈ సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుండగా, హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు.