హైదరాబాద్ ‘ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి’కి గొప్ప రికార్డు
మన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ప్రపంచ టాప్-10 కంటి ఆసుపత్రులలో చోటు దక్కింది. దీనిని గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ ర్యాంకింగ్‌ను స్పెయిన్‌లోని ‘ఎస్సీ ఇమాగో’ ఇన్‌స్టిట్యూషన్ విడుదల చేసింది. దీనిలో ఈ ఆసుపత్రికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల జాబితాలో ప్రపంచంలోనే 8 వస్థానం లభించింది. ఆసియాలో రెండవ స్థానం లభించింది. భారత్‌లో తీసుకుంటే ఈ ర్యాంకింగ్‌లో ఈ ఆసుపత్రికి మాత్రమే చోటు దక్కింది. ఈ ఆసుపత్రి 1987లో హైదరాబాదులో స్థాపించబడింది. ఇది ప్రభుత్వ ఆసుపత్రి కానప్పటికీ దీనిని లాభాపేక్షలేని వైద్యసంస్థగా చెప్పుకోవచ్చు. ఈ ఆసుపత్రిలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, సమర్థవంతమైన చికిత్సను తారతమ్యాలు లేకుండా అందిస్తారు.

దీనిని ప్రముఖ భారతీయ చలన చిత్ర నిర్మాత ఎల్. వి. ప్రసాద్ ఈ నేత్ర వైదశాల కోసం అప్పట్లో బంజారాహిల్స్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని, కోటి రూపాయల నగదును దానం చేశారు. ఆయన దానానికి గుర్తుగా ఈ సంస్థకు ఆయన పేరును ఆ సంస్థకు పెట్టారు. దీనిని గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు 30 ఏళ్ల క్రిందట స్థాపించారు. చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలైన ఈ సంస్థ నేడు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది.

