ప్రధానికి ఘోర అవమానం..
ప్రధాని నరేంద్ర మోదీకి ఘోర అవమానం జరిగింది. ఆయనని సొంత పార్టీ ముఖ్యమంత్రియే అవమానం పరచటం గమనార్హం. మోదీపై సీఎం చేసిన వ్యాఖ్యలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం భజన్ లాల్ కు ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడిగాడు. మీకు ఇష్టమైన నటుడు ఎవరు? అని జర్నలిస్ట్ ప్రశ్నించాడు..నరేంద్ర మోదీ అన్నారు సీఎం భజన్‌లాల్. ఆయన అలా సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.

