Home Page SliderNational

ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ప్రభుత్వ పాఠశాల

ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ప్రభుత్వ పాఠశాలను ఢిల్లీలో ముఖ్యమంత్రి ఆతిశీ ప్రారంభించారు. ఆప్ ప్రభుత్వం విద్యారంగానికెంతో ప్రాముఖ్యం ఇస్తుందని, ఇలాంటి పాఠశాలను కేజ్రీవాల్ తప్ప ఎవరూ కట్టలేరని ఆమె పేర్కొన్నారు. నేడు బాలల దినోత్సవం కారణంగా ఈ అద్భుతమైన పాఠశాలను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాఠశాల స్థలాన్ని, భూ మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న అత్యంత రద్దీ ఏరియాలో నిర్మించామని, ఇక్కడ 7 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 130 కి పైగా తరగతి గదులు, లైబ్రరీ, లిఫ్ట్, లెక్చర్ హాల్, 7 ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.