News

తెలంగాణ ప్రజలకు నిఖార్సయిన ప్రత్యామ్నాయం?

రాజకీయాల్లో ఎప్పుడూ మంచి, చెడు, రెండూ ఉంటాయి. కానీ మంచి పాలు ఎక్కువగా, చెడుపాలు తక్కువగా చూసుకోవడం అనేది ఓటర్ విజ్ఞతకు నిదర్శనమని చెప్పాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. వాస్తవానికి గతంలో వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే వారు అన్న భావన ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. పలానా పార్టీకి ఓటేయాల్సిన కంపల్షన్ ఇప్పుడేమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు సరికొత్త పొందికలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు, ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణలో గడిచిన తొమ్మిదేళ్లుగా గులాబీ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో పాలన సాగిస్తోంది. పాలన ఎలా ఉంది? ఏం జరుగుతుంది? ప్రజలకు ఏం లభించిదన్నదానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. కేసీఆర్ పాలన నమూనాపై ఇప్పటికే ప్రజల్లో ఒక అవగాహనకు వచ్చారు. ఏం చెప్తున్నారు? ఏం చేస్తున్నారన్నదానిపై సమగ్ర అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓవైపు కన్పిస్తుంటే మరోవైపు ప్రత్యామ్నాయం‌గా కాంగ్రెస్ పార్టీ కూడా కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏ విధంగా పాలించింది? తెలంగాణకు ఏం చేసింది? మనందరికీ తెలిసిందే! కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఓటేయాలని గతంలో ఓటర్లకు పిలుపునిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎప్పుడు ఇచ్చింది? ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిందన్నది మనకు బాగా తెలుసు! ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు నిఖార్సయిన ఒక ఆల్టర్నేటివ్ కన్పిస్తోంది.

ముందు ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో, ప్రధాన మోడీ మార్గదర్శనంలో అద్భుత నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రూపంలో ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు, బీజేపీ నుంచి తెలంగాణ ప్రజలకు ఒక సుస్థిర నాయకత్వాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. నిరాడంబరత, విశ్వసనీయత, సమర్థత ఆయుధాలుగా ఇద్దరు నేతలు ప్రజల్లోకి వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం అంటే ఆషామాషీ విషయం కాదన్నది మనందరికీ తెలిసిన విషయమే! కానీ నాయకత్వం సమర్ధవంతంగా ఉండే, ఆ నాయకత్వానికి విశ్వసనీయత ఉంటే అది ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తీర్చుతుంది. తెలంగాణలో ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు. ఇన్నాళ్లూ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నచందంగా ఉన్న పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనను కోరుకుంటున్నారు. 2014 నుంచి కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో ఉన్న సుపరిపాలనను ఇప్పుడు తెలంగాణలో కూడా చూడాలనుకుంటున్నారు. పాలనలో అవినీతి అన్నది ఇసుమంతైనా కనిపించకుండా సాగుతున్న తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు తెలంగాణలో సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే అశ్రతిపక్షపాతం, అవినీతి, బంధుప్రీతి అన్నవి లేకుండా అడుగులు పడాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్న అభిప్రాయం ఉంది. కేంద్రంలో మోడీ సర్కారు, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంటే… అభివృద్ధి పరుగు పరుగున జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వాస్తవానికి బీజేపీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండటం వల్ల కలిసి పనిచేయడం వల్ల అభివృద్ధి ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవవుతోంది. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ అభివృద్ధి నమూనాను చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రజలకు ఎంతో ఆదరణ, అభిమానం, సంక్షేమం లభిస్తాయి. కేంద్రం నుంచి నిధులు, స్థానిక సర్కారు బాధ్యత రెండూ కలిస్తే ప్రజలకు సుపరిపాలన లభిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణలో ఓవైపు కేసీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి నాయకత్వం ప్రజలకు కనిపిస్తోంది. వీరిలో ఎవరికి క్రెడిబిలిటీ ఏంటో.. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు చాలా బాగా తెలుసు. ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది ప్రజలే ఆలోచించుకోవాలి. బీజేపీ పక్షాన ప్రజల ముందు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, తదితర బీజేపీ నేతలు కనిపిస్తుంటే మరోవైపు నిలకడలేని కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కనిపిస్తున్నారు. ప్రజలకు హామీలివ్వడం, అమలు చేయకపోవడమన్నది బీఆర్ఎస్ పాలనలో మనం చూస్తూనే ఉన్నాం. చెప్పేదొకటి, చేసేది మరోటి.. ఇవన్నీ కూడా మనకు కళ్ల ముందు కన్పిస్తూనే ఉన్నాయి. రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఒకరు పాలన చేస్తుంటే, మరొకరు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆబగా ఎదురు చూస్తున్నారు. మరొకరు ఉన్న స్థాయిని బట్టి ప్రజలకు తాము చేయగలిగినదంతా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్స్. ఎవరికి ఓటేస్తే జీవితాలు బాగుపడతాయన్నది తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.